తన ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు..
డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ వృద్ధుడి ఆరోపణ కూకట్‌పల్లి: ( ప్రభంజనం ) తన సొంత ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపడుతున్న తనను సొసైటీ కార్యదర్శి, ఆమె భర్త డబ్బుల కోసం వేధిస్తూ తప్పుడు ఆరోపణలతో నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని భగత్‌సింగ్ నగర్ ఫేజ్-2, ప్లాట్ నంబర్ 1024 యజమాని ఎం.డి. జక్రియ ఆరోపించారు. ఆదివారం భగత్‌సింగ్ నగర్ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 85 ఏళ్లు నిండాయని, ఈ వయస్సులో సొంతింటి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉన్నప్పటికీ, ఐడీపీఎల్ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్...