కంటోన్మెంట్‌లో హై అలర్ట్.. బొల్లారంలో ఆయుధాలు మిస్సింగ్‌

సికింద్రాబాద్‌ (ప్రభంజనం):సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ యూనిట్‌కు చెందిన ఆయుధ విభాగంలో కొన్ని ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆర్మీ అధికారులు అప్రమత్తమై, కంటోన్మెంట్‌ పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయుధాల విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా 12కు పైగా ఆయుధాలు మిస్సింగ్‌ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయుధాలను భద్రపరిచిన స్టోరేజ్‌ బ్యారక్‌ తలుపులు పగులగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు...