ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కొడుకు హిట్ అండ్ రన్..రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన
ఒకరు మృతి, విద్యార్థికి తీవ్ర గాయాలు సిటీ క్రైమ్ ( ప్రభంజనం ): రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం.. నందులాల్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన మహీంద్రా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నందులాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి...