PRABANJANAM
Date of Publish : 25 August 2026, 1:16 pm Posted by : Prabanjanam News

Jubilee Hills CI suspension: జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్.. నిర్లక్ష్యమే కారణం!

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌కు సంబంధించిన వ్యవహారంలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినట్లు అభియోగాలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేయడంతో పాటు, అతన్ని అదుపులోకి తీసుకోవడంలోనూ ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. సీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం మూడు వారాల క్రితమే ఆయన జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం గమనార్హంఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.