రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో భార్యాభర్తల గొడవ..

భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య హుస్నాబాద్: ( ప్రభంజనం ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్‌లో వెంకటేశం అనే వ్యక్తిని అతని భార్య రాజమణి రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశం ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాజమణి ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో...