PRABANJANAM
Date of Publish : 01 September 2026, 3:40 pm Posted by : Prabanjanam News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది.సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ రంగనాథ్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 3కు వాయిదా వేసింది.