వివేకానందనగర్‌లో పచ్చదనంపై కత్తికట్టిన అక్రమార్కులు!

అనుమతి లేని షెడ్డు కోసం ఏపుగా పెరిగిన చెట్టు తొలగింపు స్థానికులు, ప్రకృతి ప్రేమికుల తీవ్ర ఆగ్రహం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు కూకట్ పల్లి(ప్రభంజనం): పచ్చదనానికి మారుపేరుగా నిలవాల్సిన ఓ ప్రశాంత కాలనీలో వ్యాపార కాంక్ష పచ్చని చెట్లను బలి తీసుకుంటోంది. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’, ‘వనమహోత్సవం’ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంటే.. కొందరు అక్రమార్కులు మాత్రం తమ వ్యాపార లాభాల కోసం నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కనీస అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాల...