రామంతపూర్ లో భక్త మార్కండేయ శివాలయ నూతన ముఖద్వార ప్రారంభోత్సవం

పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు ఉప్పల్, అక్టోబర్ 11, (ప్రభంజనం) రామంతపూర్ పద్మశాలి సంఘం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్త మార్కండేయ శివాలయ నూతన ఆర్చ్ ( ముఖ ద్వారము ) ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విచ్చేసి ఆర్చ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్...