సైబరాబాద్ కమిషనరేట్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన సీపీ డాక్టర్ రమేష్ శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. అనేక దేశాలు స్వాతంత్ర్యం పొందినప్పటికీ రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల అమలులో...