కేటీఆర్‌ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కేటీఆర్‌ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్‌ నగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్దార్‌ కరణ్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జేఎన్‌టీయూహెచ్‌ జేఏసీ చైర్మన్‌ ఎరవెల్లి జగన్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు, స్థానికులు, చిన్నారులు పాల్గొన్నారు.