జగద్గిరిగుట్ట లో గంజాయి చాక్లెట్ల రవాణా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్..

23 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం మేడ్చల్ ప్రతినిధి (ప్రభంజనం):  విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు గంజాయి చాక్లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారం, మహాదేవపురం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులతో పాటు ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు...