Jamili Elections: 2029 నాటికే జమిలి ఎన్నికలు…? ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై కీలక సంకేతాలు

అనుకున్నదానికంటే ముందే జమిలి అమలు దిశగా అడుగులు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు.. జేపీసీ ఛైర్మన్ పి.పి. చౌదరి వెల్లడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ప్రతిపాదన న్యూఢిల్లీ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందుగా అంచనా వేసిన 2034 కంటే ఐదేళ్ల ముందే, అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అధ్యయనం...