Jinnaram : నిబంధనల ఉచ్చులో.. మంబాపూర్ అభివృద్ధి..!
రహదారి విస్తరణ, వీధి దీపాల పనులకు అటవీశాఖ అడ్డంకులు అటవీశాఖ ఆంక్షలతో నిలిచిన రోడ్డు వెడల్పు పనులు జిన్నారం: వివిధ ప్రభుత్వ శాఖల నిబంధనలు గ్రామాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారాయని మంబాపూర్ సర్పంచ్ కొత్తకొండ భాస్కర్ ఆరోపించారు. గుమ్మడిదల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంబాపూర్ గ్రామంలో ఎదురవుతున్న రహదారి, విద్యుత్ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తూ అధికారులను నిలదీశారు. గ్రామానికి ఉన్న...