JNTUలో విద్యార్థుల ఘర్షణ కలకలం.. 8 మంది అదుపులో: బాలానగర్ డీసీపీ రితిరాజ్

కూకట్ పల్లి( ప్రభంజనం ): కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ (JNTU) క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ రితిరాజ్ వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని, డయల్ 100కు ఫిర్యాదు అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని డీసీపీ తెలిపారు. అయితే అర్దరాత్రి 2:30 గంటల ప్రాంతంలో విద్యార్థులు మరలా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ఈ ఘర్షణలో...