జేఎన్టీయూ వసతి గృహాల కేటాయింపులో గందరగోళం
అధికారుల నిర్ణయాలపై విద్యార్థుల అసంతృప్తి తెలంగాణ బ్యూరో (ప్రభంజనం): జేఎన్టీయూ వసతి గృహాల కేటాయింపు విషయంలో ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత నెలలో వసతి గృహాల్లో గదులు సరిపోవడం లేదంటూ అధికారులు పేర్కొనగా, మంజీర వసతి గృహంలోని కింది అంతస్తును ఐదో సంవత్సరం విద్యార్థులకు కేటాయించారు. అయితే ప్రస్తుతం మళ్లీ ఐదో సంవత్సరం విద్యార్థుల్లో వసతి గృహం అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మూడో సంవత్సరం విద్యార్థులు కింది అంతస్తులో ఉండాలంటే...