ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో జీవో 49 అమలు చేయాలి
ఏజెన్సీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ప్రతినిధుల డిమాండ్ [caption id="attachment_75419" align="alignnone" width="300"] మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రతినిధులు[/caption] ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లలో ప్రభుత్వం జీవో నంబర్ 49ను అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. జీవో 49ను వర్తింపజేయకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగ...