- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ ఎస్ చీఫ్ కవిత
శేరిలింగంపల్లి: ( ప్రభంజనం )
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆయా పార్టీల నుండి టీఆర్ ఎస్ పార్టీలోకి రాజకీయ చేరికలు జోరందుకుంటున్నాయి. సీపీఎం, ఎంసీపీఐ (యూ) పార్టీలకు చెందిన గూడా లావణ్య, గూడ శ్రీనివాస్‌తో పాటు పలువురు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం ద్వారా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను విస్తరించడంతో పాటు నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేరికలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.