Jubilee Hills: జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌గా అశోక్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొత్త ఇన్స్పెక్టర్‌గా ఎం. అశోక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల బదిలీల నేపథ్యంలో, ఈ కీలక స్థానంలోకి అశోక్‌ను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతకు అత్య ప్రాధాన్యం ఇస్తామని, రాత్రివేళల్లో...