- భుజానికి శస్త్రచికిత్స, నేడు 8వారాల పాటు రెస్ట్
సినిమా డెస్క్( ప్రభంజనం ): భుజానికి గాయంతో కొన్ని రోజులుగా బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు నేడు ( బుధవారం )కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగనుంది. ఇందుకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. సర్జరీ తర్వాత 6-8 వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. భుజం నొప్పి కారణంగా ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న పలు సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి.