Kaleshwaram Project: కాళేశ్వరంపై దుష్ప్రచారానికి ఆధారాలే చెంపపెట్టు: హరీశ్‌రావు

రిపోర్టుల సాక్షిగా కాళేశ్వరం.. కాంగ్రెస్‌ ప్రచారంపై హరీశ్‌రావు ఫైర్ ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సీడబ్ల్యూసీ పీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు అన్నారం, సుందిళ్ళ మోటార్లు ఆన్ చేసి నీళ్ళు లిఫ్ట్ చేయాలని డిమాండ్ హైదరాబాద్ బ్యూరో (ప్రభంజనం): కాళేశ్వరం మొత్తం కుప్పకూలింది.. ప్రాజెక్టు పనికిరాదు.. నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతోంది. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్‌ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని, మరోవైపు సీడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని,...