కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలనే వెంటనే అమలు చేయాలి
శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన శేరిలింగంపల్లి : ( ప్రభంజనం ) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ ఇంఛార్జ్ మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు స్థానిక నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కాలనీలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు....