రోడ్డు ప్రమాదంలో పాపన్నపేట పంచాయతీ కారోబార్ కృష్ణ మృతి

యూసుఫ్‌పేట శివారులో ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ఒకరి పరిస్థితి విషమం.! మెదక్ ప్రతినిధి,(ప్రభంజనం): ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో పాపన్నపేట పంచాయతీ సిబ్బంది దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనం పై బంధువైన వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుంచి పాపన్నపేట...