PRABANJANAM
Date of Publish : 04 September 2026, 10:43 am Posted by : Prabanjanam News

కేసీఆర్ చాలా మంచోడు: ఎమ్మెల్యే కొండా సురేఖ

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. “కేసీఆర్ చాలా మంచోడు.. మమ్మల్ని ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. ఆయనలో ఒక హుందాతనం ఉంటుంది.. మేము ఎప్పుడు వెళ్లినా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు” అని ఆమె పేర్కొన్నారు. తాము అడగగానే కేసీఆర్ గారు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తుచేశారు.మరోవైపు, త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేయడంతో రాజకీయ సర్కిళ్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఏ దారిలో సాగుతుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది; దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.