కేసీఆర్ చాలా మంచోడు: ఎమ్మెల్యే కొండా సురేఖ

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. "కేసీఆర్ చాలా మంచోడు.. మమ్మల్ని ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. ఆయనలో ఒక హుందాతనం ఉంటుంది.. మేము ఎప్పుడు వెళ్లినా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు" అని ఆమె పేర్కొన్నారు. తాము అడగగానే కేసీఆర్ గారు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తుచేశారు.మరోవైపు, త్వరలో ప్రారంభం కానున్న...