PRABANJANAM
Date of Publish : 22 August 2026, 8:50 am Posted by : Prabanjanam News

కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్

  • ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

కూకట్ పల్లి (ప్రభంజనం):  కూకట్‌పల్లిలో కొరియన్ డెర్మా క్లినిక్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రారంభించారు. క్లినిక్ నిర్వాహకులు, ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా. ప్రణయ్ రెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో చర్మవ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్స, కాస్మెటిక్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కూకట్‌పల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. డా. ప్రణయ్ రెడ్డికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.