కాంగ్రెస్ నేత అండతో… ధర్మారెడ్డి ఫేజ్-1లో అక్రమ నిర్మాణాలు

అండగా నిలుస్తానని హామీ ఇస్తున్న కాంగ్రెస్ నేత అందరినీ చూసుకుంటానని హామీలు.. నిర్మాణదారుడి నుండి లక్షల్లో వసూళ్లు. కూకట్ పల్లి(ప్రభంజనం): రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు అవినీతిరహిత పాలనను అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుంటే.. అదే పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు మాత్రం నిబంధనలను గాలికి వదిలేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో సాగుతున్న ఓ అక్రమ నిర్మాణం, దాని వెనుక జరుగుతున్న వసూళ్ల పర్వం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ అండతోనే ఇదంతా జరుగుతుందనే...