KPHB land auction: కేపి.హెచ్.బి లో గజం భూమి రూ.2.70 లక్షలు.. ఒకే రోజు 47 కోట్ల ఆదాయం

రికార్డు ధర పలికిన హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్లు ఒక్కరోజే రూ.47.14 కోట్ల ఆదాయం. కూకట్ పల్లి ( ప్రభంజనం):  కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కెపీహెచ్‌బీ కాలనీలో భూముల ధరలు మరోసారి గరిష్ట స్థాయిని తాకాయి. ఎలాంటి వివాదాలు లేకపోవడం, అన్ని రకాల వసతులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ లభించింది. బహిరంగ వేలంలో ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.కెపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం హౌసింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం...