కేపీహెచ్‌బీలో చోరీ.. పాత నేరస్థుడు అరెస్ట్
కూకట్ పల్లి( ప్రభంజనం): కేపీహెచ్‌బీ కాలనీలో ఇంట్లో ల్యాప్‌టాప్, మొబైల్ చోరీ చేసిన పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీనగర్‌కు చెందిన పాటిల్ సందీప్ (27)ను సీసీఎస్ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ క్రైమ్ టీమ్ సంయుక్తంగా అరెస్ట్ చేసింది. ఈ నెల 29న కేపీహెచ్‌బీ ఫేజ్-1లో ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో రూ.70 వేల విలువైన ల్యాప్‌టాప్, మొబైల్ చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి శుక్రవారం లులు మాల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి...