PRABANJANAM
Date of Publish : 04 September 2026, 9:01 am Posted by : Prabanjanam News

Krishnashtami: భాష్యం పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కూకట్ పల్లి( ప్రభంజనం ): వివేకానందనగర్‌లోని భాష్యం పాఠశాల వీవీఎన్‌ బ్రాంచ్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు, భగవద్గీత సందేశాలను వివరిస్తూ విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా

పాఠశాల ప్రిన్సిపాల్‌ బండారు సుధా మాధవి మాట్లాడుతూ.. పండుగల ద్వారా విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.