ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా రేపు బీఆర్‌ఎస్‌వీ నిరసన.. పాల్గొననున్న కేటీఆర్‌

ఢిల్లీ ఘటనకు నిరసనగా శుక్రవారం బీఆర్‌ఎస్‌వీ ఆందోళన ఇందిరాపార్క్‌లో స్వయంగా నిరసనల్లో పాల్గొంటానన్న కేటీఆర్‌ విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపు యువత గొంతు అణచలేరని వ్యాఖ్య ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టనుంది. దీంట్లో తాను స్వయంగా పాల్గొంటానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయలేరని అన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేసిన కేటీఆర్‌.. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్‌లో జరిగే బీఆర్‌ఎస్‌వీ ఆందోళనలో పాల్గొంటానని...