PRABANJANAM
Date of Publish : 01 September 2026, 11:56 am Posted by : Prabanjanam News

Illegal Construction: కూకట్ పల్లిలో పొంచి ఉన్న ప్రమాదం…67 గజాల్లో 4వ అంతస్తు నిర్మాణం

  • కేవలం 67 గజాల్లోనే నాలుగో అంతస్తు వరకు దూసుకుపోతున్న వైనం
  • మయూరి మెడికల్ హాల్ ఎదురుగా ఉన్న లైన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనులు
  • ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ స్థానికుల ఆందోళన

కూకట్ పల్లి( ప్రభంజనం): నగరంలో భవన నిర్మాణ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండాపూర్ ప్రాంతంలో అతి తక్కువ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల వల్ల జరిగిన ప్రమాద ఘటనల తాలూకు భయాలు ఇంకా వీడకముందే.. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో అచ్చం అలాంటి ఘటనే పునరావృతమవుతోంది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఇరుకు సందుల్లో అంతస్తుల మీద అంతస్తులు లేపుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో ఈ ప్రమాదకర నిర్మాణం జోరుగా సాగుతోంది. స్థానిక ఈడబ్ల్యూఎస్‌ 494, రోడ్డు నంబర్ 2లోని మయూరి మెడికల్ హాల్ ఎదురుగా ఉన్న లైన్‌లో కేవలం 67 గజాల అతి తక్కువ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండా, కనీస ఇంజనీరింగ్ ప్రణాళికలు పాటించకుండా ఇప్పటికే ఈ నిర్మాణం నాలుగో అంతస్తు  వరకు చేరుకుంది.

ప్రాణాలపై భయం భయం..

కొద్దిరోజుల క్రితం కొండాపూర్‌లో ఇరుకు స్థలంలో నిర్మిస్తున్న భవనం కుప్పకూలిన ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. అచ్చం అలాగే కూకట్‌పల్లిలోని ఈ ప్రాంతంలోనూ అతి తక్కువ గజాల్లో అంతస్తులు నిర్మిస్తుండటంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్థలంలో పునాదుల బలం సరిపోದೆ భవనం పక్కకు ఒరిగితే పరిస్థితి ఏంటని వాపోతున్నారు.

చర్యలు శూన్యం?

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్టౌఅటు కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి అక్రమ, ప్రమాదకర నిర్మాణాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జోనల్ అధికారులు స్పందించి, ఆ నిర్మాణాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పెను ప్రమాదం మునుముందు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి బాధ్యత వహించేది ఎవറని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.