Kukatpally : 22 ‘ఏ’ చట్టంపై సీబీఐ విచారణ జరపాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కాంగ్రెస్ నిరంకుశ పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్. కూకట్ పల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలు, నిరంకుశ పరిపాలనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం శేషాద్రి నగర్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత మూడేళ్ల కాలంలో కాలయాపన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. కేపీహెచ్‌బీ పరిధిలోని వసంత్ నగర్, సర్దార్...