కుంభవృష్టి ఖాయం, ప్రాణనష్టం తప్పదు.. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక!
లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం కార్యక్రమం ఈసారి తీవ్ర ఆగ్రహంతో ఉన్నానన్న ఉజ్జయిని మహంకాళి కుంభవృష్టి, అగ్నిప్రమాదాలు తప్పవని హెచ్చరిక ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని అమ్మవారి ఆదేశం తప్పితే భారీ ప్రాణనష్టం తప్పదని భవిష్యవాణి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు అత్యంత కీలకమైన 'రంగం' కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత పచ్చి మట్టికుండపై నిలబడి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై...