ఆఖరి రాఖీ ఇదేనా అన్నయ్యా.. విగతజీవుడైన అన్న శవానికి చెల్లెలు కన్నీటి వీడ్కోలు!

హైదరాబాద్ బ్యూరో:  పండుగ కళతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు గుండెలు పగిలే శోకం తాండవిస్తోంది. తోడబుట్టిన అన్నతో పండగ జరుపుకోవాల్సిన ఆ చెల్లెలి జీవితంలో ఆ దేవుడు తీరని విషాదాన్ని నింపాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లికి చెందిన నవీన్ అకస్మాత్తుగా జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇకపై తనను కంటికి రెప్పలా కాపాడే అన్న లేడనే నిజాన్ని ఆ చెల్లెలు పూజిత జీర్ణించుకోలేకపోతోంది. ప్రాణం పోయి విగతజీవుడిగా పడి ఉన్న అన్న మృతదేహం వద్ద ఆ పసిదిక్కు...