ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు స్వస్తి పలుకుదాం…
మట్టి విగ్రహాలనే పూజిద్దాం! ప్రకృతిని కాపాడుదాం... భక్తితో పూజిద్దాం! నీటి వనరులను కాపాడుకుందాం మట్టి వినాయకులనే ప్రతిష్ఠిద్దాం! విజ్ఞాన్ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల పర్యావరణ చైతన్యం ఘట్కేసర్, (ప్రభంజనం) వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికి మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని మాజీ కౌన్సిలర్ బేతాల నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ డివిజన్ ఈడబ్ల్యుఎస్ కాలనీ...