నాగారంలో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన
నాగారం బస్‌స్టాప్ వద్ద బైఠాయింపు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికుల ఆగ్రహం కీసర: ( ప్రభంజనం ) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం డివిజన్‌లో సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు నాగారం బస్‌స్టాప్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సెల్ టవర్ ఏర్పాటుతో తమకు, పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగారం బస్‌స్టాప్ పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటంతో విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సెల్ టవర్...