Madinaguda: మదీనాగూడలో ప్రణామ్100 పడకల మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి
ప్రారంభించిన పీఏసీ ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి ( ప్రభంజనం ): మదీనాగూడలోని ప్రణామ్ హాస్పిటల్స్ నూతన భవనంలో మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 పడకల ‘మదర్ అండ్ చైల్డ్’ ఆసుపత్రిని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. డాక్టర్...