టాయిలెట్ కడిగిన మంత్రి జూపల్లి…! ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతపై మంత్రి సీరియస్..
తానే స్వయంగా టాయిలెట్ శుభ్రం చేసిన జూపల్లి పెంట్లవెళ్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై అసహనం నాగర్ కర్నూల్ (ప్రభంజనం) :నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై మండిపడ్డారు. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సంబంధిత అధికారులు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు నిత్యం సందర్శించే...