ఢిల్లీ విమానాశ్రయంలో కోతి పుర్రె కలకలం
హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగులో లభించిన పుర్రె, మంత్రదండం న్యూఢిల్లీ (ప్రభంజనం): ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి బ్యాగేజీలో జంతువు పుర్రె, మంత్ర దండం వంటి వస్తువులు గుర్తించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి.. ఆగస్టు 10న విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ...