ఘట్‌కేసర్‌లో రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి..
ఔషాపూర్ వద్ద రైలు ఢీకొని మూగజీవాల మృత్యువాత దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని 100కుపైగా గొర్రెలు బలి! రైలు శబ్దానికి బెదిరిన గొర్రెలు.. పట్టాలపైకి పరుగులు కాపరుల కళ్లముందే మూగజీవాల మృతి.. విషాదం! ఘట్‌కేసర్, (ప్రభంజనం): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కేపాల్ సమీపంలో కాపరి నిద్రిస్తున్న సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న...