ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు: పొలిటికల్ ఎంట్రీపై క్లూ ఇచ్చిన హీరో విశాల్

నటుడిగా ప్రజల నుంచి ఎంతో అభిమానాన్ని పొందానన్న విశాల్ మీ కోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నానని వ్యాఖ్య సమయం అనుకూలిస్తే ప్రజాక్షేత్రంలో నిలబడతానని వెల్లడి కోలీవుడ్‌లో స్టార్ హీరోలంతా వరుసగా రాజకీయ బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 'తమిళగ వెట్రి కళగం' పార్టీతో తుపాను సృష్టించిన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరోవైపు, ఇటీవల మరో హీరో ధనుష్ చేసిన కామెంట్స్ ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చకు తెరలేపాయి. తాజాగా ఈ జాబితాలో మాస్ హీరో విశాల్ కూడా...