నాచారంలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. ఏడు క్వింటాళ్లు స్వాధీనం, ఒకరి అరెస్ట్
నాచారం: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సూర్యనగర్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో ఉప్పల్ మరియు నాచారం ఎస్‌ఓటీ (SOT) పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 7 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నేమా బుక్యా గణేష్ అనే వ్యక్తిని పోలీసులు సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం...