PRABANJANAM
Date of Publish : 16 August 2026, 2:20 pm Posted by : Prabanjanam News

దీనబంధు కాలనీలో ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం

  • ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్ పల్లి: ( ప్రభంజనం )

దీనబంధు కాలనీలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆలయానికి విచ్చేసి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీనబంధు కాలనీ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించి, బోనాల పండుగ ఉత్సవంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, దీనబంధు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.