మంత్రి పదవికి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలి: రోజా
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న రోజా 427 మందికి అక్రమంగా పోస్టులు కట్టబెట్టారని ఆరోపణ లోకేశ్ రాజీనామా చేసేంత వరకు పోరాటం ఆగదని వ్యాఖ్య డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల నిర్వహణలో భారీగా అక్రమాలు, కుంభకోణం జరిగాయంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై నిప్పులు చెరిగారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెకండ్ గేట్ వద్ద వైసీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో రోజా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా...