ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి:కేంద్ర మంత్రి బండి సంజయ్
హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయండి హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌ను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని...