అర్చకుల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ..కూకట్ పల్లి లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కర దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు కూకట్‌పల్లి,: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణల నడుమ జాతీయ పతాకావిష్కరణ ఆవిష్కరించారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అర్చకులు, భక్తులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం సమర్పించి,...