- శ్యామ్@స్వామికి నేషనల్ అవార్డు
నాచారం, ( ప్రభంజనం):
నాచారం పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న నాచారం నివాసి స్వామి అలియాస్ శ్యామ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాయ్ ఫౌండేషన్ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఈ నెల 15న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో అందించే బెస్ట్ సోషల్ వర్క్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తన సేవలను గుర్తించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి స్వామి అలియాస్ శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవే లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని పేర్కొన్నారు.