PRABANJANAM
Date of Publish : 21 August 2026, 7:00 pm Posted by : Prabanjanam News

సోమాజిగూడలో కొత్త హంగులతో నూతన మలబార్ షో రూమ్

  • ప్రారంభించిన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, ఎమ్మెల్యే దానం నాగేందర్
  • వినియోగదారుల మన్ననలు అందుకోవాలని ఆకాంక్ష

ఖైరతాబాద్: ( ప్రభంజనం )

సోమాజిగూడలో నూతన హంగులతో ఆధునీకరించిన మలబార్ షో రూమ్ ను శుక్రవారం కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో కలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకోవాలని అన్నారు.
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నందున నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ఆభరణాలతో మగవలు మహిళల అందం రెట్టింపు అవుతుందని శ్రీనిధి శెట్టి అన్నారు. శ్రావణ శుక్రవారం ఆభరణాల షోరూంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్వాహకులు, వినియోగదారులు పాల్గొన్నారు.