ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు!

అవినీతి ఆరోపణలు.. ఫిర్యాదుల వెల్లువ 12 మందికి పైగా బాధితులు.. ఉన్నతాధికారుల విచారణ.. ఘట్‌కేసర్, (ప్రభంజనం): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిర్యాదుల పరిష్కారంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు, భూ వివాదాల్లో తలదూరుస్తున్నారన్నా విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం వచ్చే పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన...