PRABANJANAM
Date of Publish : 19 August 2026, 6:58 pm Posted by : Prabanjanam News

Omni Hospital Kukatpally : బ్రెయిన్‌ సర్జరీకి వెళ్లిన వ్యక్తికి కాళ్లకు ఫ్రాక్చర్లు.. ఓమ్ని ఆసుపత్రిపై బాధితుల ఆరోపణలు

కూకట్‌పల్లి: బ్రెయిన్‌ సర్జరీ కోసం కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి చికిత్స అనంతరం కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు డిశ్చార్జ్‌ సమ్మరీలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్రెయిన్‌ సర్జరీకి ముందు కాళ్లకు ఎలాంటి ఫ్రాక్చర్లు లేవని వారు తెలిపారు.

బ్రెయిన్‌ సర్జరీ మాత్రమే చేయాల్సి ఉందని వైద్యులు సూచించడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించామని బాధితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే సర్జరీ అనంతరం ఇచ్చిన డిశ్చార్జ్‌ సమ్మరీలో కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు పేర్కొన్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై బాధితులు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమస్యను సెటిల్‌మెంట్‌ ద్వారా పరిష్కరించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. “80 శాతం మేము చెల్లిస్తాం.. 20 శాతం మీరు భరించాలి” అంటూ ఒత్తిడి తెచ్చారని బాధితులు పేర్కొన్నారు.

తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.